Watch: గన్‌తో పాముపై కాల్పులు జరిపిన వ్యక్తి.. అది ఏం చేసిందంటే?
రివాల్వర్‌తో తొలుత ఒక రౌండ్‌ను ఆ పాముపైకి కాల్పులు జరిపాడు. గురి తప్పడంతో మరో బుల్లెట్‌ను దగ్గర నుంచి ఫైర్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆ నాగుపాము..
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన వద్ద ఉన్న గన్‌తో పాముపైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆగ్రహించిన ఆ పాము ఏం చేసిందో చూస్తే మీరు భయపడతారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడు. కచ్చా రోడ్డుపై ఒక నాగుపాము కనిపించింది. దీంతో అతడు తన వాహనాన్ని ఆపాడు. ఆ పామును కవ్వించేందుకు ప్రయత్నించాడు. తన వద్ద ఉన్న రివాల్వర్‌తో తొలుత ఒక రౌండ్‌ను ఆ పాముపైకి కాల్పులు జరిపాడు. గురి తప్పడంతో మరో బుల్లెట్‌ను దగ్గర నుంచి ఫైర్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆ నాగుపాము జరజర ముందుకు పాకుతూ కాటు వేసేందుకు వేగంగా ఆ వ్యక్తి వైపు దూసుకొచ్చింది.
కాగా, ఇన్స్టెంట్ కర్మ అన్న యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘నాగుపాముతో పోరాటానికి గన్ తీసుకురావద్దు’ అని శీర్షిక పెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సుమారు రెండు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. నెటిజన్లు కూడా ఘటుగా, ఫన్నీగా కామెంట్లు చేశారు. ఆ పాము డేర్‌డెవిల్ అని ఒకరు, మూడో షాట్ కాల్పులకు అది అవకాశం ఇవ్వలేదని మరొకరు వ్యాఖ్యానించారు. అలాగే గన్‌తో పాముపై కాల్పులు జరుపడాన్ని పలువురు విమర్శించారు. వినోదం కోసం తుపాకీతో కాల్చి పామును చంపేందుకు ప్రయత్నించడంపై మండిపడ్డారు.
Don't bring a gun to a cobra fight! 🐍 pic.twitter.com/qGshAWdjHu
— Klipz Entertainment (@klip_ent) December 16, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

