విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడికి రెండుసార్లు గుండెపోటు.. కాపాడిన భారత సంతతి వైద్యుడు
విమానంలో ప్రయాణించిన 43 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో సీటు నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన విమాన సిబ్బంది డాక్టర్ కోసం అనౌన్స్ చేశారు. దీంతో డాక్టర్ విశ్వరాజ్ వెంటనే స్పందించి రోగి వద్దకు వెళ్లారు.
ముంబై: విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆ విమానంలో ప్రయాణించిన భారత సంతతి వైద్యుడు సుమారు రెండు గంటలపాటు చికిత్స అందించి ఆ వ్యక్తిని కాపాడారు. దీంతో ఆ వైద్యుడి సేవలను ఆయన పని చేసే ఆసుపత్రి కొనియాడింది. డాక్టర్ విశ్వరాజ్ వేమల బ్రిటన్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్స్ బర్మింగ్‌హామ్‌లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్‌గా వైద్య సేవలందిస్తున్నారు. తన తల్లిని బెంగళూరులోని సొంత ఇంటికి తీసుకువచ్చేందుకు నవంబర్‌లో ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు ప్రయాణించారు. అయితే ఆ విమానంలో ప్రయాణించిన 43 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో సీటు నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన విమాన సిబ్బంది డాక్టర్ కోసం అనౌన్స్ చేశారు. దీంతో డాక్టర్ విశ్వరాజ్ వెంటనే స్పందించి రోగి వద్దకు వెళ్లారు. విమాన సిబ్బంది సహాయంతో గంటపాటు సీపీఆర్ చేసి ఆయన స్పృహలోకి వచ్చేలా చేశారు. విమానంలో ఉన్న ఎమర్జెన్సీ కిట్ ద్వారా ఆక్సిజన్, ఇతర వైద్య సేవలు అందించారు.
కాగా, గుండెపోటుకు గురైన ఆ వ్యక్తి హార్ట్ రేట్, బీపీ, పల్స్, ఆక్సిజన్ స్థాయిలు తెలుసుకునేందుకు విమానంలో ఎలాంటి పరికరాలు లేవు. దీంతో విమాన సిబ్బంది వాటి కోసం మరోసారి అనౌన్స్మెంట్ ఇచ్చారు. లక్కీగా కొందరు ప్రయాణికుల వద్ద అవి ఉన్నాయి. దీంతో వాటి ద్వారా ఆ వ్యక్తి పరిస్థితిని తెలుసుకున్నారు. అయితే డాక్టర్‌తో మాట్లాడుతూనే ఆ వ్యక్తి రెండోసారి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో డాక్టర్ విశ్వరాజ్ మరో గంటపాటు సీపీఆర్ చేయడంతో ఆ వ్యక్తి కొంత కోలుకున్నాడు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ఆ విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం ఎయిర్పోర్ట్ సిబ్బంది హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. విమానం దిగే ముందు ఆ వ్యక్తి చాలా భావోద్వేగానికి గురయ్యాడని, కన్నీళ్లతో తనకు కృతజ్ఞతలు చెప్పాడంటూ డాక్టర్ విశ్వరాజ్ గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటనను తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. కాగా, యూనివర్సిటీ హాస్పిటల్స్ బర్మింగ్‌హామ్ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. భారత సంతతి వైద్యుడు విశ్వరాజ్ తోటి విమాన ప్రయాణికుడ్ని కాపాడిన తీరును ప్రశంసించింది.
Dr Vishwaraj Vemala, one of our consultant hepatologists, saved the life of a passenger who suffered two cardiac arrests mid-flight. With limited supplies, Dr Vemala was able to resuscitate him before handing over to emergency crews on the ground.
📰: https://t.co/VFOAa1VQyU pic.twitter.com/EXEg9Udujj— University Hospitals Birmingham (@uhbtrust) January 3, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

