న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో పలు రాష్ట్రాలు లాక్డౌన్లు, కఠిన నియంత్రణలు అమలు చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎగబాకిన నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మే నెలలో 11.9 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.17 శాతానికి దిగివచ్చిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గురువారం వెల్లడించింది.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌తో పాటు నియంత్రణలను ఎత్తివేయడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించడంతో ఉపాధి అవకాశాలూ మెరుగయ్యాయి. ఐటీ సహా సేవల రంగం, తయారీ రంగంలో కొలువులు, నూతన నియామకాలు జోరందుకోవడంతో నిరుద్యోగ రేటు తగ్గుముఖం పట్టిందని సీఎంఐఈ డేటా వెల్లడించింది.