నితీశ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు: తేజశ్వి యాదవ్

పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ విమర్శించారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసు నమోదు కోసం ఒక ఐఏఎస్ అధికారి ఐదు గంటలకు పైగా పోలీస్ స్టేషన్లో కూర్చున్నారని, అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదని తేజశ్వి ఆరోపించారు.

మరోవైపు సీఎం నితీష్ కుమార్‌తోపాటు మరికొందరిపై మోసం, నకిలీ పత్రాలు సృష్టించడంపై తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు గార్దనిబాగ్ ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు ఐఏఎస్ అధికారి, బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మాజీ చైర్మన్ సుధీర్ కుమార్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి పలు గంటలు వేచి ఉన్నా పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. ఒక రసీదు మాత్రమే తనకు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
కాగా, సుధీర్ కుమార్ నుంచి ఫిర్యాదు తీసుకుని ఆయనకు రసీదు ఇచ్చామని పోలీస్ అధికారి అరుణ్ కుమార్ తెలిపారు. అందులోని అంశాలను చదివిన తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

