7న ఎమ్మెల్యేగా సీఎం మమతా బెనర్జీ ప్రమాణం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 7న ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని గవర్నర్‌ను తాము అభ్యర్థించినట్లు ఆ రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీ తెలిపారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవి చేపట్టారు.
కాగా, మమత సీఎంగా కొనసాగాలంటే ఉప ఎన్నికలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె 58,835 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సాధించారు. మమతకు 85,263 ఓట్లు రాగా, ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్కు 26,428 ఓట్లు పడ్డాయి. ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. జంగీపూర్‌లో టీఎంసీ అభ్యర్థి జాకీర్ హుస్సేన్ 92,480 ఓట్ల మెజారిటీతో, షంషేర్ గంజ్‌లో అమీరుల్ ఇస్లామ్ 26,379 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

