CM Ashok Gehlot: గత ఏడాది బడ్జెట్ చదివిన సీఎం గెహ్లాట్.. అసెంబ్లీలో ప్రతిపక్షం ఆందోళన
CM Ashok Gehlot: సీఎం గెహ్లాట్ గత ఏడాది బడ్జెట్‌ను చదివినట్లు రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండు శాఖలకు చెందిన గత ఏడాది లెక్కల్ని ఆయన చదవినట్లు తెలుస్తోంది.
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ గత ఏడాది బడ్జెట్ చదవినిట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. 2023-24 సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఇవాళ సీఎం గెహ్లాట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రసంగంలో భాగంగా సీఎం గెహ్లాట్ రెండు ప్రకటనలు చేయగానే.. విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆ రెండు స్కీమ్‌లు గత ఏడాది బడ్జెట్లో ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశాయి.
ఆ సమయంలో స్పీకర్ సీపీ జోషి కలగచేసుకుని.. విపక్షాలు ఆందోళన వీడాలన్నారు. కానీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలను ఆపలేదు. దీంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. సభను వాయిదా వేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోనే నిరసన కొనసాగించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టరాదు అని, అది లీకైందా అని బీజేపీ నేత గులాబ్ చాంద్ కటారియా తెలిపారు.
గత ఏడాది బడ్జెట్లోని పట్టణ ఉద్యోగ కల్పన, కృషి బడ్జెట్ అంశాలపై సీఎం గెహ్లాట్ పాత లెక్కలు చదివినట్లు బీజేపీ ఆరోపణలు చేసింది. 8 నిమిషాల పాటు పాత బడ్జెట్‌నే గెహ్లాట్ చదివారని మాజీ సీఎం వసుంధరా రాజే ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

