Student Kills Aunt | పిన్నితో లైంగిక చర్యకు బాలుడు యత్నం.. ఆమె ప్రతిఘటించడంతో హత్య
Student Kills Aunt | నిద్రిస్తున్న పిన్నితో లైంగిక చర్య కోసం బాలుడు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆమె అతడ్ని తీవ్రంగా మందలించింది. దీని గురించి కుటుంబ సభ్యులకు చెబుతుందన్న భయంతో ఆ మహిళను బాలుడు హత్య చేశాడు.
బెంగళూరు: నిద్రిస్తున్న పిన్నితో లైంగిక చర్య కోసం బాలుడు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆమె అతడ్ని తీవ్రంగా మందలించింది. దీని గురించి కుటుంబ సభ్యులకు చెబుతుందన్న భయంతో ఆ మహిళను బాలుడు హత్య చేశాడు. (Student Kills Aunt) కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉప్పినంగడి సమీప గ్రామానికి చెందిన 37 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. ఆ మహిళ ఇంట్లో ఉన్న పదో తరగతి చదువుతున్న బాలుడు తన తండ్రికి ఫోన్ చేశాడు. గుండెపోటుతో పిన్ని చనిపోయిందని చెప్పాడు.
కాగా, మహిళ అనుమానాస్పద మరణం గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఆమె ఇంట్లో ఉన్న బాలుడిపై అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడి వీపుపై చేతితో రక్కిన ఆనవాళ్లు ఉన్నట్లు బాలుడి తండ్రి పోలీసులకు తెలిపాడు. బుధవారం బాలుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో ఆమెను తానే చంపినట్లు అతడు ఒప్పుకున్నాడు.
ఇంట్లో నిద్రిస్తున్న పిన్నితో లైంగిక చర్య కోసం ప్రయత్నించినట్లు ఆ బాలుడు తెలిపాడు. ప్రతిఘటించిన ఆమె తనను మందలించిందని పోలీసులకు చెప్పాడు. అయితే ఇంట్లో వారికి దీని గురించి చెబుతుందేమోనని భయాందోళన చెందానని అన్నాడు. తిరిగి నిద్రలోకి జారుకున్న పిన్ని ముఖాన్ని దిండితో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తనను తోసివేసేందుకు ప్రయత్నించినప్పుడు తన వీపుపై ఆమె రక్కిందని పోలీసులకు వెల్లడించాడు. ఆ బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

