సంక్షేమ పథకాలను ఓటరు ఐడీ కార్డ్‌తో లింక్ పెట్టవద్దు
ఆధార్ కార్డు ప్రాతిపాదికగా కాకుండా ఓటర్ ఐడెంటిటీని అనుసంధానం చేసి పౌరులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై సిటిజన్స్ ఫ్రాటర్నిటీ ఫోరమ్ (సీఎఫ్ఎఫ్-భారత్) ఆందోళన వ్యక్తం చేసింది.
- కేంద్ర మంత్రికి పౌర సంఘం విజ్ఞప్తి
న్యూఢిల్లీ, నవంబర్ 13: ఆధార్ కార్డు ప్రాతిపాదికగా కాకుండా ఓటర్ ఐడెంటిటీని అనుసంధానం చేసి పౌరులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై సిటిజన్స్ ఫ్రాటర్నిటీ ఫోరమ్ (సీఎఫ్ఎఫ్-భారత్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు ఒక లేఖ రాస్తూ ఓటర్ల జాబితాలో స్థితిని సంక్షేమ పథకాల లబ్ధి పొందడానికి ఎంతమాత్రం ఆధారం చేయరాదని కోరింది.
సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా అందులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే ప్రభుత్వ చర్యలను తాము స్వాగతిస్తున్నామని తెలిపింది. అయితే లబ్ధిదారులకు సంబంధించిన ప్రక్రియలలో ఎపిక్/ఓటరు ఐడీ, బయోమెట్రిక్ ధ్రువీకరణపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరింది. కేవలం ఓటరు ఐడీ కార్డు లేనంత మాత్రాన అర్హులైన ఏ పౌరుడికీ పథకాలను తిరస్కరించరాదన్న విషయాన్ని నమ్ముతున్నామని తెలిపింది. గురువారం రాసిన ఈ లేఖపై ఢిల్లీ మాజీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఏఎంయూ మాజీ వైస్ చాన్స్‌లర్ జమీరుద్దీన్ షా, మాజీ దౌత్యవేత్త కుమార్ శర్మ తదితరులు సంతకం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

