Yediyurappa: మైనర్ బాలికను యడ్యూరప్ప వేధించారు.. 750 పేజీల ఛార్జ్‌షీట్‌లో సీఐడీ వెల్లడి
Yediyurappa: మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు యడ్యూరప్పపై ఛార్జ్‌షీట్‌లో సీఐడీ పేర్కొన్నది. పోక్సో కేసుకు చెందిన 750 పేజీల ఛార్జ్‌షీట్‌ను గురువారం రిలీజ్ చేశారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు యడ్డీ ప్రయత్నించినట్లు కూడా ఆ ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు.
బెంగుళూరు: బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప(Yediyurappa) మైనర్ బాలికను తన ఇంట్లో లైంగికంగా వేధించినట్లు సీఐడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నది. వేధింపులకు చెందిన 750 పేజీల ఛార్జ్‌షీట్‌ను సీఐడీ గురువారం రిలీజ్ చేసింది. 17 ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో యడ్యూరప్పతో పాటు మరో ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు. తన కూతురిపై యడ్డీ వేధింపులకు పాల్పడినట్లు ఆ అమ్మాయి తల్లి ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన ఫేస్బుక్ అకౌంట్లో ఓ వీడియోను అప్లోడ్ చేసిన విషయం తెలిసిందే.
2024, ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 11.15 నిమిషాలకు బాధిత మైనర్ తన తల్లితో కలిసి యడ్యూరప్ప ఇంటికి వెళ్లారు. బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లారు. లైంగిక దాడి కేసులో సాయం కోరేందుకు వాళ్లు మాజీ సీఎం ఇంటికి వెళ్లారు. తల్లితో మాట్లాడుతూనే యడ్యూరప్ప బాధితురాలి చేయిని పట్టుకున్నట్లు సీఐడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నది. ఆ తర్వాత మైనర్ అమ్మాయిని మరో రూమ్‌లోకి పిలిపించి గతంలో జరిగిన లైంగిక వేధింపుల ఘటన గురించి అడిగినట్లు తెలుస్తోంది. బాధితురాలి వయసు తెలుసుకున్న యడ్డీ.. ఆ తర్వాత లైంగికంగా వేధించే ప్రయత్నం చేసినట్లు సీఐడీ రిపోర్టులో పేర్కొన్నారు. మాజీ సీఎం చేయిని తోసేసిన బాధితురాలు.. రూమ్ నుంచి బయటకు పారిపోయింది. బాధితురాలి తల్లికి యడ్డీ డబ్బులు ఇచ్చినట్లు ఛార్జ్‌షీట్‌లో రాశారు.
ఫిబ్రవరి 20వ తేదీన బాధితురాలి తల్లి వీడియోను అప్లోడ్ చేసిన తర్వాత .. ఈ కేసులో నిందితులుగా ఉన్న అరుణ్, రుద్రేశ్, మారిస్వామిలు.. బాధితురాలిని, ఆమె తల్లిని కలిసే ప్రయత్నం చేశారు. యడ్యూరప్ప ఇంటికి బాధితురాలిని, ఆమె తల్లిని తీసుకెళ్లిన వాళ్లు.. ఐఫోన్ గ్యాలరీ నుంచి ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వీడియోను డిలీట్ చేయించారు. యడ్యూరప్ప ఆదేశాల ప్రకారం బాధితులకు రెండు లక్షలు చెల్లించారు.
యడ్యూరప్పపై పోక్సోలోని సెక్షన్ 8 కింద కేసు బుక్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 354ఏ, 204, 214 కింద కూడా ఫిర్యాదు నమోదు చేశారు. మిగితా ముగ్గురు నిందితులపై ఐపీసీ 204, 214 సెక్షన్ల కింద కేసు పెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

