తిరువనంతపురం: జుట్టు పెరుగుదలపై కొలెస్ట్రాల్ ప్రభావం ఉంటుందని కేరళ యూనివర్సిటీ బృందం గుర్తించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పీ శ్రీజిత్ సారథ్యంలో చేసిన అధ్యయనం వివరాలు జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రీప్రొడక్షన్లో ప్రచురితమయ్యాయి. కొలెస్ట్రాల్ బయోసింథెసిస్ నిరోధం జుట్టు కుదుళ్లు శాశ్వతంగా బలహీనపడటానికి కారణమవుతుందని వీరు గుర్తించారు. కొలెస్ట్రాలోజెనిక్ మార్పుల వల్ల జుట్టు కుదుళ్లలోని మూల కణాలు నాశనం అవుతాయని తెలిపారు. కుదుళ్లు, చర్మ ఆరోగ్యంపైనా కొలెస్ట్రాల్ ప్రభావం చూపిస్తుందని వీరు పేర్కొన్నారు.