Uganda Children: ట్రంప్‌పై హత్యాయత్నం.. సీన్‌ను రీక్రియేట్ చేసిన ఉగాండా చిన్నారులు.. వీడియో
Uganda Children: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై గత శనివారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనను ఉగాండా చిన్నారులు రీక్రియేట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)పై గత శనివారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియా సభలో ప్రసంగిస్తున్న సమయంలో అతనిపై బుల్లెట్ దూసుకువచ్చింది. అయితే ఆ ఘటనను ఉగాండా చిన్నారులు(Uganda Children) రీక్రియేట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. టిక్‌టాకర్ బ్లడ్ అగ్ దీన్ని తీశారు. అయితే ఈ వీడియో కోసం చిన్నారులు.. చెక్క రైఫిళ్లు, ప్లాస్టిక్ వస్తువులను వాడారు.
అటాక్‌పై సెటైర్లా ఉన్న ఈ వీడియోపై విమర్శలు వస్తున్నాయి. దీంట్లో ఓ చిన్నారి .. ట్రంప్ పాత్రను పోషించాడు. పోడియంపై మాట్లాడుతున్న సమయంలో బుల్లెట్ తగలగానే, చిన్నారితో పాటు అక్కడ ఉన్న సెక్యూర్టీ కింద దాక్కున్నట్లు చిత్రీకరించారు. ఇక ఆ మీటింగ్‌కు హాజరైన జనం కూడా భయంతో కింద కూర్చుండిపోయిన దృశ్యాన్ని కూడా షూట్ చేశారు. రక్తం చిందుతున్నా.. ట్రంప్ తన పిడికిలి బిగించి పోరాడుతాం అన్న డైలాగ్ కొట్టిన స్టయిల్లోనే .. ట్రంప్ పాత్ర పోషించిన పిల్లవాడు అరిచాడు.
ట్రంప్‌ను సీక్రెట్ సర్వీస్ సురక్షితంగా తీసుకెళ్తున్న సీన్‌ను కూడా ఉగాండా పిల్లలు అద్భుతంగా రీక్రియేట్ చేశారు. కానీ ఇలాంటి సున్నితమైన అంశాలపై వీడియో తీయడం పట్ల నెటిజన్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
Ugandan Kids re-enact the Trump Assassination Attempt pic.twitter.com/2tck8GNa23
— ɖʀʊӄքǟ ӄʊռʟɛʏ 🇧🇹🇹🇩 (@kunley_drukpa) July 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

