Childless Man Kidnaps Toddler | పసిబిడ్డను కిడ్నాప్ చేసిన సంతానం లేని వ్యక్తి.. పోలీసులకు అప్పగించిన భార్య
Childless Man Kidnaps Toddler | సంతానం లేని వ్యక్తి పసిబిడ్డను కిడ్నాప్ చేశాడు. (Childless Man Kidnaps Toddler) ఆ బాబును తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఆ పసి బాబును పోలీసులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆమె భర్తను అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: సంతానం లేని వ్యక్తి పసిబిడ్డను కిడ్నాప్ చేశాడు. (Childless Man Kidnaps Toddler) ఆ బాబును తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఆ పసి బాబును పోలీసులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆమె భర్తను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జైత్పూర్ ప్రాంతంలో ఒక మహిళ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నది. ఆమెకు ఇద్దరు పిల్లలు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో 11 నెలల బాబు ఏడ్చాడు. దీంతో పార్లర్ బయటకు తీసుకెళ్లి ఆడించాలని ఎనిమిదేళ్ల కుమార్తెకు ఆ మహిళ చెప్పింది.
కాగా, స్కూటర్‌పై వచ్చిన 39 ఏళ్ల వ్యక్తి బ్యూటీ పార్లర్ బయట బాలికతో ఉన్న పసి బాబును ఎత్తుకెళ్లాడు. ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఆందోళన చెందిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఒక వ్యక్తి స్కూటర్‌పై పసి బాబును తీసుకెళ్లడాన్ని గమనించారు. ఆ స్కూటర్ నంబర్ ఒక మహిళ పేరుతో రిజిస్టర్ అయ్యిందని గుర్తించారు.
మరోవైపు పసిబిడ్డను అపహరించిన ఆ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. అతడి భార్య ఇది తెలుసుకుని ఆందోళన చెందింది. గురువారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. జరిగిన సంగతి చెప్పి పసిబిడ్డను పోలీసులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో పసి బాబును కిడ్నాప్ చేసిన మహిళ భర్త నవీన్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. నోయిడాలోని ఒక స్టోర్‌లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న అతడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీస్ అధికారి తెలిపారు. సంతానం లేకపోవడంతో బాబును కిడ్నాప్ చేశాడని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

