జైపూర్: వేగంగా వెళ్తున్న కారు బానెట్‌పై బాలుడు కూర్చొన్నాడు. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం వీడియో తీశారు. ఆ చిన్నారికి ప్రమాదం కలిగేలా వ్యవహరించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Boy On Speeding Car’s Bonnet) స్పందించిన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాతీయ రహదారి 52లోని గుర్జార్ కా ధాబా ప్రాంతంలో ఒక కారు వేగంగా వెళ్తున్నది. కారు ముందున్న బానెట్‌పై పదేళ్ల వయస్సున్న బాలుడు కూర్చొన్నాడు. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం వీడియో తీశారు.
కాగా, మరో కారులో ప్రయాణించిన వ్యక్తి దీనిని రికార్డ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడికి ప్రమాదం కలిగించేలా ఉన్న రీల్ స్టంట్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఝలావర్ పోలీసులు స్పందించారు. సుమోటోగా కేసు నమోదు చేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా యజమానిని గుర్తించి తగిన చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు.
#WATCH | ये खतरनाक स्टंट वाला वीडियो राजस्थान के झालावाड़ का बताया जा रहा है। आरोपी ने मासूम बच्चे को कार के बोनट पर बैठाया और सड़क पर तेज गाड़ी दौड़ाई। ऐसा उसने रील बनाने के चक्कर में किया। घटना का वीडियो वायरल हुआ तो पुलिस हरकत में आई और उसे अरेस्ट कर लिया गया। pic.twitter.com/KRLvC5fZhX
— Hindustan (@Live_Hindustan) December 26, 2024