zolgensma injection: చిన్నారికి 16 కోట్ల ఇంజెక్షన్ ఫ్రీగా ఇచ్చిన అమెరికా సంస్థ
దీనికోసం జన్యు మార్పిడి థెరపీ కోసం ఉపయోగించే జోల్గెన్స్మా ఇంజెక్షన్ ( zolgensma injection )ను అమెరికా సంస్థ తయారు చేస్తోంది. అయితే ఇంత ఖరీదైన ఇంజెక్షన్ కొనడం మామూలు వాళ్ల వల్ల సాధ్యం కాదు.

నాసిక్: అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న శివ్‌రాజ్ దావరే అనే చిన్నారికి అమెరికా సంస్థ రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను ఫ్రీగా ఇచ్చింది. ఓ లక్కీ డ్రా గెలవడంతో ఆ చిన్నారికి ఖరీదైన ఇంజెక్షన్ ఇలా ఉచితంగా వచ్చింది. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఈ రెండేళ్ల చిన్నారి అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికోసం జన్యు మార్పిడి థెరపీ కోసం ఉపయోగించే జోల్గెన్స్మా ఇంజెక్షన్ ( zolgensma injection )ను అమెరికా సంస్థ తయారు చేస్తోంది. అయితే ఇంత ఖరీదైన ఇంజెక్షన్ కొనడం మామూలు వాళ్ల వల్ల సాధ్యం కాదు. శివ్‌రాజ్ తల్లిదండ్రులు విశాల్, కిరణ్‌ల పరిస్థితీ అదే. అయితే వాళ్లు మాత్రం తమ చిన్నారిపై ఆశలు వదులుకోలేదు.
ముంబైలోని హిందూజా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడ న్యూరాలజిస్ట్ డాక్టర్ బ్రజేష్ ఉదాని ఈ జోల్గెన్స్మా ఇంజెక్షన్‌నే సమర్థవంతమైనదని చెప్పారు. అయితే నాసిక్‌లో జిరాక్స్ షాప్ నడిపే వాళ్లకు అంత పెద్ద మొత్తం సమకూర్చడం అసాధ్యం. ఆ సమయంలోనే ఈ ఇంజెక్షన్ కోసం అమెరికా సంస్థ నిర్వహించే లాటరీకి దరఖాస్తు చేసుకోమని సలహా ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 25న వీళ్లు దరఖాస్తు చేసుకోగా.. లక్కీ డ్రాలో విజేతలుగా తేలారు. ఈ ఏడాది జనవరి 19న ఆ ఇంజెక్షన్‌ను ఇచ్చారు. దీంతో ఆ చిన్నారి ఇప్పుడు ఆనందంగా తన రెండో బర్త్ డే జరుపుకోబోతున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

