Justice DY Chandrachud: సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ పేరును ప్రతిపాదించిన జస్టిస్ లలిత్
Justice DY Chandrachud: 50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సీజేఐ యూయూ లలిత్ ప్రతిపాదించారు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజే పేరు
న్యూఢిల్లీ: 50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్(Justice DY Chandrachud) పేరును సీజేఐ యూయూ లలిత్ ప్రతిపాదించారు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజే పేరును వెల్లడించాలని కొన్ని రోజుల క్రితం జస్టిస్ లలిత్‌కు న్యాయశాఖ లేఖ రాసింది.
రిటైర్ కావడానికి నెల రోజుల ముందే సీజేఐ.. కాబోయే చీఫ్ జస్టిస్ పేరును సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆ నియమం ప్రకారమే ఇవాళ సీజేఐ యూయూ లలిత్.. తదుపరి సీజే పేరును ప్రకటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ముందే ఇవాళ సిఫారసు లేఖను ఆయన అందజేశారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టులో రెండవ సీనియర్ లాయర్. ఆయన పేరును తదుపరి సీఐగా ప్రతిపాదిస్తూ రాసిన లేఖను జస్టిస్ లలిత్ కేంద్రానికి పంపారు. ఒవకేళ జస్టిస్ లలిత్ చేసిన ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తే, అప్పుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండేళ్ల పాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నవంబర్ 10, 2024లో ఆయన రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ భారత 16వ సీజేఐగా చేశారు. ఆయన ఫిబ్రవరి 2, 1978 నుంచి జూలై 11, 1985 వరకు సీజేఐగా చేశారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు. తాజాగా మహిళల గర్భస్త్రావంపై వచ్చిన సంచలన తీర్పు ఈయన ఇచ్చిందే. అవివాహిత మహిళలు కూడా 24 వారాల గర్భాన్ని తొలగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఆయన తీర్పునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

