ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా సీబీఐ దాడులు చేపడుతోంది : చిదంబరం
ఎఫ్ఐఆర్లో తన పేరు లేకున్నా సీబీఐ తన నివాసాల్లో సోదాలు చేపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. సీబీఐ బృందాలు మంగళవారం తన కుమారుడు కార్తీ చిదంబరం నివాసంతో పాటు ఢిల్లీ, చెన్నైలోని తన ఇండ్లపై సోదాలు నిర్వహించాయని అన్నారు.
న్యూఢిల్లీ : ఎఫ్ఐఆర్లో తన పేరు లేకున్నా సీబీఐ తన నివాసాల్లో సోదాలు చేపట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. సీబీఐ బృందాలు మంగళవారం తన కుమారుడు కార్తీ చిదంబరం నివాసంతో పాటు ఢిల్లీ, చెన్నైలోని తన ఇండ్లపై సోదాలు నిర్వహించాయని అన్నారు.
సీబీఐ అధికారులు చూపిన ఎఫ్ఐఆర్లో నిందితుడిగా తన పేరు లేదని, సోదాల్లో సీబీఐ ఎలాంటి పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకోలేదని, వారు ఏమీ గుర్తించలేదని చిదంబరం పేర్కొన్నారు. సీబీఐ సోదాలు చేపట్టిన సందర్భం, సమయం ఆసక్తికరంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.
2011లో రూ 50 లక్షల ముడుపులు స్వీకరించి 250 మంది చైనా జాతీయులకు వీసాలను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరంపై సీబీఐ తాజా కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, చెన్నై సహా కార్తి చిదంబరానికి చెందిన ఇండ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. మరోవైపు ఐఎన్ఎక్స్, ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులోనూ కార్తీ చిదంబరంపై సీబీఐ పలు అభియోగాలు మోపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cbi
- Chidambaram
- FIR
- house
RELATED ARTICLES
తాజా వార్తలు
నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

