‘నీళ్ల కోసం ఏడ్వాలి, నీళ్లలో చావాలి’.. చెన్నై కార్పొరేషన్ తీరుపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
Madras High Court: తమిళనాడు రాజధాని చెన్నై నగర కార్పొరేషన్ తీరుపై మద్రాస్ హైకోర్టు ( Madras High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరం వరదల్లో చిక్కుకోకుండా

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగర కార్పొరేషన్ తీరుపై మద్రాస్ హైకోర్టు ( Madras High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరం వరదల్లో చిక్కుకోకుండా చర్యలు తీసుకోవడంలో కార్పొరేషన్ విఫలమైందని మండిపడింది. ‘ఏడాదిలో సగం రోజులు మేం నీళ్ల కోసం ఏడ్చేలా చేశారు. మిగిలిన సగం రోజులు మమ్ముల నీళ్లలో చచ్చేలా చేశారు’ అని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌కు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రతి వర్షాకాలం నగరం నీట మునుగుతున్నా నగర కార్పొరేషన్ ఎందుకు తగిన చర్యలు చేపట్టడంలేదని మొట్టికాయలు వేసింది.
2015లో చెన్నై నగరాన్ని భారీ వరదలు ముంచెత్తాయని, అది జరిగి ఐదు సంవత్సరాలైన గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ వరదలను నివారించే చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్ పీడీ ఆదికేశవులు నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా చెన్నైలో వరదలు పోటెత్తకుండా నగర కార్పొరేషన్ చర్యలు తీసుకోకపోతే తాము ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

