Bell Peppers | సబ్జి నుంచి పిజా వరకూ క్యాప్సికం ఎన్నో డిష్‌లకు టేస్ట్, ఫ్లేవర్ అందిస్తుంటుంది. పలు రెసిపీల్లో వీటిని ఆస్వాదిస్తుంటారు. అయితే సరైన పద్ధతిలో క్యాప్సికంను కట్ చేయడం చాలా మందికి తెలియదు. ప్రముఖ చెఫ్ అజయ్ చోప్రా భిన్న రకాల బెల్ పెప్పర్స్‌ను వినూత్న రీతిలో కట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ క్లిప్‌లో అజయ్ చోప్రా ఈ వెజిటబుల్‌ను మూడు భిన్న రకాల్లో కట్ చేయడం కనిపిస్తుంది. నెట్టింట సందడి చేస్తున్న ఈ వైరల్ క్లిప్ పెద్దసంఖ్యలో నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను చూసిన పలువురు యూజర్లు కామెంట్ సెక్షన్లో చెఫ్ అజయ్ చోప్రాపై ప్రశంసలు గుప్పించారు.
ఇది చాలా అద్భుతం క్యాప్సికం ఎలా కట్ చేయాలనేది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇతరులకు సాయం చేయడంలో మీ చొరవ ప్రశంసనీయమని మరో యూజర్ రాసుకొచ్చారు. మీ కటింగ్ నైపుణ్యాలు అద్భుతం..మిస్టర్ చెఫ్ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.
Read More :
Immunity Boosting Drinks | ఈ పానీయాలతో గొంతు నొప్పికి చెక్..!