Cheater: అతడు చిన్న వయసులోనే ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. వచ్చే జీతంతో తృప్తిపడకుండా మోసాల బాటపట్టాడు. రెండు చీటింగ్ కేసులలో అతడు నిందితుడిగా తేలడంతో ఆర్మీ అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం జైలుకు వెళ్లి బెయిలుపై బయటికి వచ్చాడు.
అయినా తన బుద్ధి మార్చుకోలేదు. మళ్లీ మోసాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తాను ఆర్మీ ఉద్యోగినని, తనకు రూ.1.25 లక్షలు ఇస్తే ఆర్మీ కాలేజీలో క్లర్క్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆమె ఇచ్చిన రూ.1.25 లక్షలు సొంతానికి వాడుకున్నాడు.
ఆ తర్వాత ఆమెకు ఉద్యోగం ఇప్పించలేదు, డబ్బు వాపస్ ఇవ్వలేదు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా అతడు మోసాలకు పాల్పడే ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నట్టు గుర్తించారు. అతడు బాధితురాలితోపాటు మరికొందరిని కూడా మోసగించి ఉంటాడని అనుమానిస్తున్నారు.