Chardham Yatra | తెరుచుకోనున్న గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు.. నేటి నుంచి చార్ధామ్ యాత్ర షురూ..!
Chardham Yatra | చార్ధామ్ యాత్ర బుధవారం ప్రారంభం కానున్నారు. అక్షయ తృతీయ రోజు సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయా ద్వారాలు తెరుచుకోనున్నాయి. దాంతో అధికారికంగా చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది.
Chardham Yatra | చార్ధామ్ యాత్ర బుధవారం ప్రారంభం కానున్నారు. అక్షయ తృతీయ రోజు సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయా ద్వారాలు తెరుచుకోనున్నాయి. దాంతో అధికారికంగా చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం 11.57 గంటలకు అభిజిత్ ముహూర్తంలో ముఖబా గ్రామం నుంచి గంగోత్రి ధామ్‌కు గంగామాత్ర డోలి బయలుదేరింది. బుధవారం ఉదయం అక్షయ తృతీయ రోజున డోలి గంగోత్రి ధామ్ చేరుతుంది. ఉదయం 10.30 గంటలకు ఆలయ ద్వారాలను తెరుస్తారు. యమునోత్రి ధామ్‌కు యమున మాతా పల్లకీ ఉదయం 8.30 గంటలకు చేరుకోనున్నది. 11.55 గంటలకు ఆలయ తలుపులు తెరువనున్నారు. చార్ధామ్ యాత్ర మార్గాన్ని 15 సూపర్ జోన్లు, 41 జోన్లు, 217 సెక్టార్లుగా విభజించారు. ఈసారి యాత్ర మార్గంలో మొత్తం 624 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. తొమ్మిది మంది ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను యాత్ర మార్గాల్లో మోహరించనున్నారు.
ఉత్తరాఖండ్‌లోని నాలుగు ప్రముఖ ఆలయాలైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు బుధవారం తెరుచుకోనుండగా.. కేదార్నాథ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4న తెరుచుకోనున్నాయి. శీతాకాలం సందర్భంగా ఆరు నెలల పాటు ఆలయాలను మూసివేసే విషయం తెలిసిందే. వేసవి నేపథ్యంలో తెరుచుకోనున్నాయి. చార్ధామ్ యాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేఠ్ సమీక్షించారు. రిషికేశ్కు చేరుకున్న ఆయన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సారి చార్ధామ్ యాత్రకు పటిష్టమైన భద్రతను కల్పించనున్నట్లు తెలిపారు. గతేడాది చార్ధామ్ యాత్రలో 48లక్షల మంది పాల్గొన్నారు. ఇప్పటికే చార్ధామ్ యాత్రకు పర్యాటకుల నుంచి స్పందన వస్తున్నది. పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొనేందుకు పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

