Natural Satellite of Earth | భూవాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నది ఎవరో తెలుసా..?
Moon | అంతుబట్టని విషయాలకు నెలవు అంతరిక్షం. ఆ విషయాల్లో చంద్రుడు కూడా ఒకటి. చంద్రయాన్-3 అనుకున్నట్టుగా సాఫ్ట్ ల్యాండింగ్ అయితే చంద్రుడి పుట్టుక, ఉపరితలంపై ఏమున్నది? అన్నదానిపై మరింత సమాచారం వెలువడుతుంది.
Moon | న్యూఢిల్లీ: అంతుబట్టని విషయాలకు నెలవు అంతరిక్షం. ఆ విషయాల్లో చంద్రుడు కూడా ఒకటి. చంద్రయాన్-3 అనుకున్నట్టుగా సాఫ్ట్ ల్యాండింగ్ అయితే చంద్రుడి పుట్టుక, ఉపరితలంపై ఏమున్నది? అన్నదానిపై మరింత సమాచారం వెలువడుతుంది. ఒక సిద్ధాంతం ప్రకారం, సౌర కుటుంబం ఏర్పడిన (6 నుంచి 17.5 కోట్ల సంవత్సరాలకు) తొలినాళ్లలో భారీ పరిమాణంలోని ఓ అంతరిక్ష శకలం భూమిని ఢీకొనగా, ఏర్పడ్డ శకలాలు.. భూమి నుంచి విడిపోయిన ఓ భాగం చంద్రుడిగా ఏర్పడ్డాయి. ఈ థియరీ చాలామంది శాస్త్రవేత్తల ఆమోదం పొందింది. ఇదికాక మరో మూడు థియరీలు ఉన్నాయని బ్రిటన్ పరిశోధకురాలు సారా రస్సెల్స్ చెబుతున్నారు.
‘ఓ ఆస్టరాయిడ్ భూ ఆకర్షణలో చిక్కుకుపోయి కొంతకాలానికి భూ కక్ష్యలో చేరింది. రెండోది..భూమి, చంద్రుడు ఒకేసారి ఆవిర్భవించాయి. మూడోది.. భూపరిభ్రమణం వల్ల ఓ ముక్క విడివడి.. చంద్రుడిగా ఏర్పడింది’ అని ఆమె వివరించారు. అపోలో మిషన్స్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టిని తీసుకురాగలిగాం. ఆ మట్టిలోని రసాయన సమ్మేళనాలు, ఐసోటోప్‌లకు.. భూమిపై లభించే వాటికి సారూప్యతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. భూమిపై స్థిరమైన వాతావరణం ఏర్పడటానికి చంద్రుడు దోహదపడుతున్నాడని ఓ థియరీ ఉంది. భూవాతావరణాన్ని చంద్రుడు ప్రభావితం చేస్తున్నాడని, చంద్రుడ్ని ‘సహజసిద్ధమైన శాటిలైట్’గా శాస్త్రవేత్తలు పేర్కొంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

