చంద్రయాన్-2, మూన్ ఆర్బిటర్.. ఢీ నివారణ

బెంగళూరు: చంద్రుడిపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్-2, నాసాకు చెందిన మూన్ ఆర్బిటర్ ఢీకునే ప్రమాదాన్ని ఇస్రో, నాసా నివారించాయి. చంద్రుడి చుట్టూ వేర్వేరు కక్ష్యల్లో పరిభ్రమిస్తున్న ఈ రెండు అంతరిక్ష నౌకలు అక్టోబర్ 20న భారత కాలమానం ప్రకారం ఉదయం 11.15 గంటలకు లూనార్ నార్త్ పోల్ వద్ద అత్యంత దగ్గరగా వస్తాయని వారం ముందుగానే అంచనా వేశాయి. ఈ సమయంలో చంద్రయాన్-2, మూన్ ఆర్బిటర్ మధ్య రేడియల్ విభజన దూరం వంద మీటర్ల కంటే తక్కువగా ఉంటుందని, ఈ రెండూ అత్యంత దగ్గరగా చేరుకునే దూరం కేవలం మూడు కిలోమీటర్లే అని ఇస్రో, జేపీఎల్/నాసా గుర్తించాయి.

ఈ నేపథ్యంలో చంద్రయాన్-2, మూన్ ఆర్బిటర్ ఢీ కు అవకాశమున్న క్లోజ్ అప్రోచ్ రిస్క్‌ను తగ్గించాలని ఇస్రో, నాసా నిర్ణయించాయి. చంద్రయాన్-2కు ఢీ నివారణ చర్యలు (క్యామ్) చేపట్టాలని పరస్పరం అంగీకరించాయి. దీంతో అక్టోబర్ 18న భారత కాలమానం ప్రకారం రాత్రి 8.22కు చంద్రయాన్-2 కక్ష్య గమనాన్ని ఇస్పో స్వల్పంగా మార్చింది. ఈ రెండు అంతరిక్ష నౌకల మధ్య తదుపరి దగ్గరి కలయికలో తగినంత పెద్ద రేడియల్ విభజన ఉండేలా క్యామ్ చర్యలు చేపట్టింది. దీని అనంతరం చంద్రయాన్-2, మూన్ ఆర్బిటర్ భవిష్యత్తులో అత్యంత సమీపానికి వచ్చే అవకాశం ఉండదని ఇస్రో తెలిపింది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

