నగరం పేరుకే కళంకం: చండీగఢ్ ఎంపీ
Kirron Kher: చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్ నుంచి అభ్యంతరకర వీడియోల లీక్ ఘటనపై స్థానిక ఎంపీ కిరెన్ ఖేర్
మొహాలీ: చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్ నుంచి అభ్యంతరకర వీడియోల లీక్ ఘటనపై స్థానిక ఎంపీ కిరెన్ ఖేర్ స్పందించారు. చండీగఢ్ యూనివర్సిటీలో జరిగిన పాశవిక ఘటన తనను కదిలించిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ కారణంగా చండీగఢ్ నగరం పేరుకు కళంకం ఏర్పడుతున్నదని ఆమె విమర్శించారు.
అయితే, చండీగఢ్ యూనివర్సిటీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చండీగఢ్ లోక్‌సభ స్థానం పరిధిలో లేదని, అది పంజాబ్‌లోని ఖరార్‌లో ఉన్నదని ఖేర్ స్పష్టం చేశారు. ఘటనపై భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాధితులైన యువతులు, వారి తల్లిదండ్రులకు ఖేర్ తన సానుభూతి తెలియజేశారు.
చండీగఢ్ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలు ఇటీవల లీకయ్యాయి. ఓ అమ్మాయి ఈ వీడియోలను తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపగా, అతను వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, నిందితురాలైన అమ్మాయి తన సొంత వీడియోలను మాత్రమే బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

