చికిత్స రేట్లను ప్రదర్శించాల్సిందే!
దేశంలో వైద్య చికిత్స ఛార్జీల ప్రదర్శనకు సంబంధించి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాన్ని అమలు చేసిన 19 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆరోగ్య సంరక్షణ బిల్లింగ్‌లో పారదర్శకతను మెరుగుపరచడం, చికిత్సకు అయ్యే ఖర్చులను రోగులు అర్థం చేసుకునేలా చేయడమే లక్ష్యంగా దవాఖానలు, క్లినిక్‌లు తమ సేవలు, సౌకర్యాల ఛార్జీలను ప్రముఖంగా ప్రదర్శించేలా చూడాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది.
- దవాఖానలకు కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలో వైద్య చికిత్స ఛార్జీల ప్రదర్శనకు సంబంధించి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాన్ని అమలు చేసిన 19 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆరోగ్య సంరక్షణ బిల్లింగ్‌లో పారదర్శకతను మెరుగుపరచడం, చికిత్సకు అయ్యే ఖర్చులను రోగులు అర్థం చేసుకునేలా చేయడమే లక్ష్యంగా దవాఖానలు, క్లినిక్‌లు తమ సేవలు, సౌకర్యాల ఛార్జీలను ప్రముఖంగా ప్రదర్శించేలా చూడాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీ వాస్తవ రాసిన లేఖలో ఆరోగ్య సంరక్షణ సంస్థలు ప్రస్తుత నిబంధనలను పాటిస్తున్నాయో లేదో సమీక్షించాలని, వాటిని సమర్థంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
‘రేట్ల ప్రదర్శనకు సంబంధించిన నిబంధనల అమలును సమీక్షించాలని, వాటిని కచ్చితంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించాలని ఆమె కోరారు. ముఖ్యంగా ప్రైవేట్ హెల్త్‌కేర్ విభాగంలో అధిక దవాఖాన బిల్లులు, ఖరీదైన బెడ్ ఛార్జీలు, మందులు, వైద్య వినియోగ వస్తువులపై భారీ లాభ మార్జిన్లు వేయడంపై పెరుగుతున్న ఆందోళనల నడుమ ఈ ఆదేశాలు వెలువడ్డాయి. మెడికల్ లేదా ఆయుష్ వీసాలపై భారత్ వచ్చే విదేశీ రోగులకు అందించే ప్యాకేజీ రేట్లను కూడా దవాఖానలో ప్రదర్శించాలని వైద్యఆరోగ్యశాఖ కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

