పోస్టల్ద్వారా ‘జన్ ఔషధి’ !
తక్కువ ధరకు లభించే నాణ్యమైన మందులుగా పేరున్న జనరిక్ ఔషధాలను మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరవేసేందుకు తపాల శాఖ సుముఖత వ్యక్తం చేసింది. కర్ణాటక రాజ్యసభ ఎంపీ లహర్ సింగ్ సిరోయా ఈ మేరకు చేసిన ప్రతిపాదన అమలుపై ఔషధ శాఖతో చర్చించి ముందుకెళ్తామని పేర్కొన్నది.
- కర్ణాటక ఎంపీ లహర్ సింగ్ సిరోయా ప్రతిపాదనకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూల స్పందన
- ఫార్మాస్యూటికల్స్ శాఖతో కలిసి పనిచేసేందుకు సుముఖత
న్యూఢిల్లీ : తక్కువ ధరకు లభించే నాణ్యమైన మందులుగా పేరున్న జనరిక్ ఔషధాలను మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరవేసేందుకు తపాల శాఖ సుముఖత వ్యక్తం చేసింది. కర్ణాటక రాజ్యసభ ఎంపీ లహర్ సింగ్ సిరోయా ఈ మేరకు చేసిన ప్రతిపాదన అమలుపై ఔషధ శాఖతో చర్చించి ముందుకెళ్తామని పేర్కొన్నది. ప్రధాన్ మంత్రి జన్ ఔషధి పరియోజన పథకం ద్వారా కేంద్రం ఏర్పాటు చేసే జనరిక్ ఔషధ దుకాణాలను విస్తృతమైన నెట్వర్క్ కలిగిన తపాల శాఖ ద్వారా ప్రజలకు చేరువ చేయాలని లహర్ సింగ్ ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పోస్టాఫీసులు, తపాలా శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో జనరిక్ ఔషధ స్టోర్లను ఏర్పాటు చేయాలని కోరారు. తపాల శాఖ బట్వాడా సేవల ద్వారా జనరిక్ మందులను గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరవేయాలని సూచించారు. ప్రజలు ఆన్లైన్లో జనరిక్ మందులను ఆర్డర్ చేసే వ్యవస్థను రూపొందించాలని సలహా ఇచ్చారు. దీనిపై ఈ నెల 7న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించి లహర్ సింగ్‌కు లేఖ రాశారు. జనరిక్ ఔషధాలను ప్రజలకు చేరువ చేసే విషయంలో ఫార్మాస్యూటికల్స్ శాఖతో కలిసి పని చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ముందుకు వెళ్తామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

