రైల్వే ఉద్యోగులకు 78 రోజుల జీతం బోనస్
పండుగవేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అర్హులైన సుమారు 11.40 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పండుగ బోనస్‌ను అందించేందుకు ఆమోదించారు.
- కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ: పండుగవేళ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అర్హులైన సుమారు 11.40 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పండుగ బోనస్‌ను అందించేందుకు ఆమోదించారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.2,009.61 కోట్లను విడుదల చేయనుండగా, ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా రూ.17,951 వరకు లభించనుంది. ట్రాక్మెయింటెనర్లు, లోకోపైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్మెన్స్, మినిస్టీరియల్ సిబ్బందితో పాటు ఇతర గ్రూప్ సీ ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం చేకూరనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖ రికార్డు స్థాయిలో 1,670 మిలియన్ టన్నుల సరుకు రవాణాను నిర్వహించడంతో పాటు, 7.41 బిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

