Support Prices | వరికి మద్దతు రూ.72 పెంపు.. వానకాలం పంటలకు మద్దతు ధరలను ప్రకటించిన కేంద్రం
వానకాలం పంటలకు కేంద్రం బుధవారం మద్దతు ధరలు ప్రకటించింది. ధాన్యంపై మరో రూ.72 పెంచింది. వచ్చే సీజన్లో ధాన్యం క్వింటాల్‌కు రూ.2,441 చెల్లించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
- పొద్దుతిరుగుడుపై అత్యధికంగా రూ.622
- మక్కజొన్నలపై అత్యల్పంగా రూ.10 పెంపు
న్యూఢిల్లీ, మే 13 : వానకాలం పంటలకు కేంద్రం బుధవారం మద్దతు ధరలు ప్రకటించింది. ధాన్యంపై మరో రూ.72 పెంచింది. వచ్చే సీజన్లో ధాన్యం క్వింటాల్‌కు రూ.2,441 చెల్లించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రుతుపవనాల రాకతో జూన్ నుంచి మొదలయ్యే వానకాలం సీజన్‌కు గాను మొత్తం 14 పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది. వరి ధాన్యం క్వింటాల్ సాధారణ రకానికి రూ.2,441, ఏ గ్రేడ్ రకానికి రూ.2,461 ప్రకటించింది.
పత్తి మీడియం రకంపై రూ.557 పెంచి క్వింటాల్‌కు రూ.8,267గా నిర్ణయించింది. మరో రకానికి రూ.8,667గా నిర్ణయించింది. అత్యధికంగా పొద్దుతిరుగుడు గింజల ధరను రూ.622 పెంచింది. క్వింటాల్‌కు రూ.8,343గా నిర్ణయించింది. గడ్డి నువ్వుల ధరను క్వింటాల్‌కు రూ.515 పెంచి రూ.10,052గాను, నువ్వుల ధరను రూ.500 పెంచి రూ.10,346గాను నిర్ణయించింది. వేరుశనగ క్వింటాల్ ధర రూ.7,517కు పెరిగింది. మక్కజొన్నలపై మద్దతు ధరను కేవలం రూ.10 మాత్రమే పెంచి రూ.2,410గా నిర్ణయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

