PM Modi | మోదీ సర్కారు ‘ఇంధన’ రాజకీయం.. పెట్రోల్ ధరలపై కేంద్రం జిమ్మిక్కులు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుంటాయ్.. కానీ దేశంలో పెట్రో ధరలు పెరుగుతుంటాయి.. ఎందుకంటే అప్పుడు ఎన్నికలుండవ్. ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీస్తే తామేం చేస్తాం.
- పెట్రోల్ ధరలపై కేంద్రం జిమ్మిక్కులు
- ఎన్నికలుంటే ఒకలా.. లేకుంటే మరోలా
PM Modi | న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుంటాయ్.. కానీ దేశంలో పెట్రో ధరలు పెరుగుతుంటాయి.. ఎందుకంటే అప్పుడు ఎన్నికలుండవ్. ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీస్తే తామేం చేస్తాం.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గులే కారణమంటూ దాటవేస్తుంది. ఇప్పుడు ముడిచమురు ధరలు పెరుగుతుంటయ్.. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పెరుగవు.. కారణం ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. మరో ఐదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటమే. ఇదీ మోదీ సర్కారు ‘ఇంధన’ రాజకీయం. ఈ విషయం ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదికలో బట్టబయలు అయ్యింది. మోదీ సర్కారు చెప్పిన ముడిచమురు అంతర్జాతీయ సూత్రీకరణ డొల్ల అని తేలింది.
నష్టాలొచ్చినా ధరలు పెంపు లేదు..
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న కారణంగా పెట్రో ధరలు పెరుగకపోవచ్చునని ‘మూడీస్’ అంచనావేసింది. దేశంలోనే 90% మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రిటైల్ సంస్థలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ 18 నెలలుగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచుతున్నాయని, నిరుడు క్రూడాయిల్ ధర భారీగా పెరిగినా.. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఈ మూడు సంస్థలకూ భారీగా నష్టాలొచ్చినా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదని పేర్కొన్నది. ఈ ఏడాది ఆగస్టు నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. రిటైల్ సంస్థల మార్జిన్లు నెగెటివ్‌లోకి వెళ్తున్నా ఇంధన ధరల్ని పెంచకపోవడానికి కారణం రాబోయే ఎన్నికలేనని నివేదికలో వెల్లడించింది. 2023-24 ప్రథమార్థంలో ముడిచమురు బ్యారెల్ ధర 78డాలర్లు ఉండగా.. సెప్టెంబర్ నాటికి 90 డాలర్లకు చేరుకొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

