Edible Oils | వంటిల్లుపై తగ్గనున్న భారం..! ఎడిబుల్ ఆయిల్‌పై దిగుమతి సుంకం గడువు పొడిగింపు..!
Edible Oils | కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో తగ్గించిన సుంకానికి సంబంధించి గడువును పొడించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వచ్చే మార్చి నాటికి ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో ధరల కట్టడి చేసేందుకు తగ్గించిన దిగుమతి సుంకం గడువును 2025 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
Edible Oils | కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో తగ్గించిన సుంకానికి సంబంధించి గడువును పొడించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వచ్చే మార్చి నాటికి ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో ధరల కట్టడి చేసేందుకు తగ్గించిన దిగుమతి సుంకం గడువును 2025 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఎడిబుల్ ఆయిల్స్‌తో పాటు, పప్పుపై దిగుమతి సుంకం మినహాయింపు సంబంధించి గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
గతంలో రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని కేంద్రం 17.5శాతం నుంచి 12.5శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దాంతో దేశీయంగా నూనెల ధరలు తగ్గి.. ప్రజలకు ధరల పెరుగుదల నుంచి ఊరట కలుగనున్నది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో 8.70శాతానికి పెరిగింది. అంతకు ముందు నెలలో 6.61 శాతంగా ఉన్నది. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారం పెరుగుతున్నది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరుగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి సైతం ఆందోళన కలిగిస్తున్నది.
భారత్ వంటనూనెల దిగుమతిలో రెండోస్థానంలో ఉన్నది. భారత్ తన అవసరాల కోసం 60శాతం నూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఇందులో అధిక భాగంగా పామాయిల్, ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి అవుతుంటాయి. భారత్‌లో ప్రధానంగా ఆవాలు, పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నుంచి తయారైన ఎడిబుల్ నూనెలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. మరో వైపు ఎర్ర కందిపప్పుపై ప్రస్తుతం అమలు చేస్తున్న జీరో దిగుమతి సుంకాన్ని సైతం కేంద్రం పొడిగించింది. మొదట ఎర్ర కందిపప్పుపై దిగుమతి సుంకాన్ని 2021 జులైలో కేంద్రం సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుంచి పలుమార్లు గడువును పొడిగిస్తూ వస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

