ఈ ఏడాదీ జన గణన లేనట్టే!
కేంద్ర బడ్జెట్లో జనగణనకు కేవలం రూ.1,309.46 కోట్లను కేటాయించారు. 2021-22లో కేటాయించిన రూ.3,786 కోట్లతో పోల్చితే ఈ మొత్తం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా జనగణన ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
- బడ్జెట్లో కేవలం రూ.1300 కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర బడ్జెట్లో జనగణనకు కేవలం రూ.1,309.46 కోట్లను కేటాయించారు. 2021-22లో కేటాయించిన రూ.3,786 కోట్లతో పోల్చితే ఈ మొత్తం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా జనగణన ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
డిసెంబర్ 24, 2019న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో జనగణనకు రూ.8,754.23 కోట్లు, జాతీయ జనాభా రిజిస్టర్ రూపకల్పనకు రూ.3,941.35 కోట్లు కేటాయించడానికి ఆమోదం తెలిపారు. అయితే కొవిడ్ కారణంగా 2020లో నిర్వహించాల్సిన జన గణనను వాయిదా వేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా మరోసారి దాన్ని వాయిదా వేశారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో పౌరులే తమ వివరాలు వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా జన గణన నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నది. ఇందుకోసం రూ.12 వేల కోట్లు ఖర్చు కావొచ్చని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

