న్యూఢిల్లీ: ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న నకిలీ ఎక్స్ (గతంలో ట్విటర్) ఖాతాలపై సీబీఎస్ఈ హెచ్చరిక జారీ చేసింది. తన అధికారిక ఎక్స్ అకౌంట్ కేవలం ‘@సీబీఎస్ఈఐఎన్డీఐఏ29’ మాత్రమేనని తెలిపింది. సుమారు 30 ఎక్స్ ఖాతాలు సీబీఎస్ఈని పోలి ఉన్నాయని సోమవారం ట్వీట్ చేసింది. ఇవి సీబీఎస్ఈ పేరు, లోగోలను వాడుకుంటున్నాయని పేర్కొన్నది. ‘@సీబీఎస్ఈ_అఫిషియల్’. ‘@సీబీఎస్ఈబోర్డ్’, ‘@సీబీఎస్ఈన్యూస్ఇండియా’ తదితర సైట్లు తమవి కాదని వెల్లడించింది.