CBSE | సీబీఎస్ఈలో కీలక మార్పు.. ఇకపై మూడు భాషల విధానం తప్పనిసరి
CBSE : ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు భాషల విధానాన్ని అమలు చేయబోతుంది.
CBSE : ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడు భాషల విధానాన్ని అమలు చేయబోతుంది. 2031 నాటికి పదో తరగతిలో కూడా మూడు భాషల విధానం అమలయ్యేలా ఈ మార్పు చేపట్టింది. అయితే, ఒకేసారి 2031లో అమలు చేయడం కాకుండా, ఇందుకోసం ఇప్పటినుంచే త్రిభాషా విధానాన్ని అమలు చేయబోతుంది.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతిలో మూడు భాషల విధానం అమలవుతుంది. 2026-27కు సంబంధించి, ఆరో తరగతికి, 2027-28లో ఏడో తరగతికి, 2028-29లో ఎనిమిదో తరగతికి, 2029-30 నాటికి తొమ్మిదో తరగతికి, 2031-31 నాటికి పదో తరగతికి మూడు భాషల విధానాన్ని అమలు చేయలని సీబీఎస్ఈ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి చదివే వారు మూడు భాషలు చదవాల్సి ఉంటుంది. ఇకపై పదో తరగతి వరకు ప్రతిఏటా ఇలాగే ఈ విధానం అమలవుతుంది. ప్రస్తుతం సీబీఎస్ఈలో రెండు భాషల విధానమే అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్‌తోపాటు మరో ప్రాంతీయ భాషను మాత్రమే అమలు చేస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020లో వచ్చిన సూచనలకు అనుగుణంగా ఈ మార్పు తీసుకొచ్చింది సీబీఎస్ఈ బోర్డు. బహుభాషా విధానం వల్ల ఉపయోగం ఉంటుందనేది దీని ఉద్దేశం. భారతీయ భాషలకు ఆదరణ కూడా పెరుగుతుందని ప్రభుత్వం కూడా విశ్వసిస్తోంది.
కొత్త విధానంలో ప్రస్తుతం ఏడో తరగతి, ఆపై తరగతులు చదువుతున్న వారికి మాత్రం మూడు భాషలు ఉండవు. రెండు లాంగ్వెజెస్ మాత్రమే చదువుకోవాలి. ప్రస్తుతం ఆరో తరగతికి మాత్రమే మూడు భాషలకు సంబంధించిన పాఠ్య పుస్తకాల్ని అందించబోతున్నట్లు సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్ తెలిపారు. వీరు 2031లో మూడు భాషలతో బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు. కొత్త విధానంలో ఏదైనా ఒక్క విదేశీ భాషను మాత్రమే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఇంగ్లీష్ మాత్రమే ఎంచుకుంటారు. కాబట్టి, మరో విదేశీ భాషకు అవకాశం లేదు. థర్డ్ లాంగ్వెజ్‌ను ఆన్లైన్లో కూడా నేర్పించే ఏర్పాట్లు చేస్తోంది సీబీఎస్ఈ. రాబోయే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల స్కిల్స్ పెంచే కొత్త సబ్జెక్టులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

