నరేంద్ర గిరి మృతి కేసులో నిందితులకు పాలీగ్రాఫ్ టెస్ట్!

లక్నో: ప్రయాగ్‌రాజ్‌లోని మఠంలో మహంతి నరేంద్ర గిరి అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ముగ్గురు నిందితులకు లై డిటెక్టర్ పరీక్షను నిర్వహించాలని సీబీఐ .. ప్రయాగ్‌రాజ్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ వద్ద దరఖాస్తు పెట్టుకున్నది. మహంతి నరేంద్ర గిరి మృతి కేసులో ఆనంద గిరి, ఆద్య తివారి, సందీప్ తివారీలపై అనుమానాలు ఉన్నాయి. అయితే ఆ ముగ్గురికీ పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని సీబీఐ భావిస్తోంది. మంగళవారం రోజున మెజిస్ట్రేట్ ముందు సీబీఐ దరఖాస్తు పెట్టింది. అక్టోబర్ 18న సీజేఎం కోర్టు దీనిపై విచారణ చేపట్టనున్నది. నిందితులు కూడా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకానున్నారు. అఖిల భారతీయ అఖాడా పరిషద్ అధ్యక్షుడు నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకునేలా నిందితులు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రయాగ్‌రాజ్‌లోని భాగంబరి మఠంలో సెప్టెంబర్ 20వ తేదీన ఉరి వేసుకుని నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముగ్గురు తనను మానసికంగా వేధించినట్లు మహంతి నరేంద్ర గిరి తన సూసైడ్ నోట్లో ఆరోపించారు. ఐపీసీలోని 306 సెక్షన్ ప్రకారం ఆ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

