Odisha train crash | బాహానగా బజార్ రైల్వే స్టేషన్‌ను సీల్ చేసిన సీబీఐ.. రైళ్లు అక్కడ ఆగవన్న అధికారులు
Odisha train crash | ఒడిశాలో గత శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంపై (Odisha train crash) దర్యాప్తు చేస్తున్న సీబీఐ బాహానగా బజార్ రైల్వే స్టేషన్‌ను సీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్లో రైళ్లు ఆగబోవని రైల్వే అధికారులు శనివారం తెలిపారు.
భువనేశ్వర్: ఒడిశాలో గత శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంపై (Odisha train crash) దర్యాప్తు చేస్తున్న సీబీఐ బాహానగా బజార్ రైల్వే స్టేషన్‌ను సీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్లో రైళ్లు ఆగబోవని రైల్వే అధికారులు శనివారం తెలిపారు. సిగ్నల్ వ్యవస్థలో మార్పులు చేయడం వల్ల మూడు రైళ్లు ఢీకొన్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తును ఆయన కోరారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఆ స్టేషన్‌తోపాటు లాగ్ బుక్, రిలే ప్యానల్, ఇతర పరికరాలను సీజ్ చేశారని సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు. సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించిన రిలే ఇంటర్ లాకింగ్ ప్యానల్‌కు సీబీఐ సీలు వేసిందని చెప్పారు. దీంతో రైలు సిబ్బంది సిగ్నలింగ్ వ్యవస్థను కంట్రోల్ చేసే వీలు లేదన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి నోటీసు జారీ చేసే వరకు బాహానగా బజార్ రైల్వే స్టేషన్లో ప్రయాణీకులు లేదా గూడ్స్ రైళ్లు కూడా ఆగవని వెల్లడించారు.
కాగా, ప్రతి రోజూ ఈ రైల్వే స్టేషన్ మీదుగా సుమారు 170 రైళ్లు ప్రయాణిస్తాయని ఆదిత్య కుమార్ తెలిపారు. కేవలం ఏడెనిమిది ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఈ స్టేషన్లో నిమిషం పాటు ఆగుతాయని చెప్పారు. అయితే మూడు రైళ్ల ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కొన్ని రోజులపాటు ఎలాంటి రైళ్లు ఈ స్టేషన్లో ఆగవని వివరించారు. మరోవైపు గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మరణించగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు కోల్పోయిన వందలాది మంది వికలాంగులుగా మారారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 15-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
KTR | కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

