Chhattisgarh PSC scam: ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ స్కామ్.. చైర్మన్ అవినీతికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపణ
Chhattisgarh Public Service Commission scam: చత్తీస్‌ఘడ్‌లో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. 2020-22 సంవత్సర కాలంలో ఆ నాటి పీఎస్సీ చైర్మెన్, అధికారులు, రాజకీయవేత్త బంధువులు, కుటుంబసభ్యులకు వివిధ జిల్లా కలెక్టరేట్లలో ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీజీపీఎస్సీ చైర్పర్సన్ తమన్ సింగ్ సోన్వాని, కార్యదర్శి జేకే ద్రువ్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ స్కామ్(Chhattisgarh PSC scam)లో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. 2020-22 సంవత్సర కాలంలో ఆ నాటి పీఎస్సీ చైర్మెన్, అధికారులు, రాజకీయవేత్త బంధువులు, కుటుంబసభ్యులకు వివిధ జిల్లా కలెక్టరేట్లలో ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీజీపీఎస్సీ చైర్పర్సన్ తమన్ సింగ్ సోన్వాని, కార్యదర్శి జేకే ద్రువ్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బంధుప్రీతితో ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కుమారులు, కూతుళ్లు, బంధువులను మెరిట్ లిస్టులో ముందు నెట్టి, జిల్లా కలెక్టరేట్లలో రిక్రూట్ అయ్యేరీతిలో అవినీతికి పాల్పడినట్లు చైర్మన్‌పై ఆరోపణలు ఉన్నాయి. తమన్ సింగ్ సోనవాని, ద్రువ్ నివాసాల్లో సోమవారం సీబీఐ దర్యాప్తు చేపట్టింది. రాయ్‌పూర్‌తో పాటు బిలాయిలో ఉన్న ఇండ్లల్లో సోదాలు జరిగాయి.
సోనావానీ కుమారుడు నితీశ్‌ను అక్రమ రీతిలో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక చేశారని సీబీఐ ఆరోపించింది. సోనావానీ సోదరిడి కుమారుడు సాహిల్‌ను డిప్యూటీ ఎస్పీ, ఆయన సోదరి కుమార్తె సునితా జోషీని లేబర్ ఆఫీసర్‌గా ఎంపిక చేశారు. మరో బంధువు నిషా కోసలే, దీపా అదిల్‌ను జిల్లా అధికారులుగా నియమించడాన్ని సీబీఐ తప్పుపట్టింది. సీపీఎస్సీ కార్యదర్శి ద్రువ్ కుమారుడు సుమిత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక చేశారని సీబీఐ ప్రతినిధి ఒకరు ఆరోపించారు. సీపీఎస్సీ పరీక్ష ద్వారా 171 మంది ఉద్యోగాలు ఇచ్చారని, దాంట్లో ఆ నాటి ప్రభుత్వ సీనియర్ అధికారుల బంధువులు, ఇంటి సభ్యులే మెరిట్ లిస్టులో ఉన్నట్లు సీబీఐ ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

