CBI | సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం పొడగింపు..
CBI | కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని పొడిగించింది. మరో ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకం కోసం సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
CBI | కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని పొడిగించింది. మరో ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకం కోసం సమావేశం జరిగిన విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని పొడిగించగా.. ఈ మేరకు డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ప్రవీణ్ సూద్ 25 మే 2023న రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన ఈ పదవిలో మే 2026 వరకు కొనసాగుతారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్‌కు చెందిన కర్నాటక కేడర్ ఐపీఎస్ అధికారి.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించక ముందు కర్నాటక డీజీపీగా పని చేశారు. ప్రవీణ్ సూద్ 1964లో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో జన్మించారు. 22 సంవత్సరాల వయసులో ఆయన ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరారు. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నుంచి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM), న్యూయార్క్‌లోని సిరక్యూస్ విశ్వవిద్యాలయంలోని మాక్స్వెల్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఆయన అనేక ఉన్నత స్థాయి కేసుల దర్యాప్తును పర్యవేక్షించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సూద్ కర్ణాటకలోని క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, ఇంటర్ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్స్‌ను బలోపేతం చేసేందుకు న్యాయవ్యవస్థతో కలిసి పని చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

