న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఇండ్లల్లో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రికి చెందిన వివిధ ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. నాగపూర్‌తో పాటు ముంబైలో ఉన్న నివాసాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు మాజీ మంత్రి ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారో ఇప్పటి వరకు సీబీఐ వెల్లడించిలేదు. మాజీ హోంశాఖ మంత్రి దేశ్ముఖ్తో పాటు ఇతర వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. నేరపూరిత కక్ష, అవినీతి ఆరోపణలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ముంబై మాజీ పోలీసు కమీషనర్ పరమ్ బీర్ సింగ్ తొలగింపు కేసులో మాజీ మంత్రి దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.