CBI books IPS Officer | 1,200 కోట్ల కుంభకోణం దర్యాప్తులో ఫోర్జరీ.. ఐపీఎస్ అధికారిణిపై సీబీఐ కేసు
CBI books IPS Officer | భారీ కుంభకోణం కేసు దర్యాప్తులో ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఐపీఎస్ అధికారిణిపై ఆరోపణలు వచ్చాయి. సీఐడీ దర్యాప్తులో ఇది బయటపడింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆమెపై కేసు నమోదు చేసింది.
ముంబై: భారీ కుంభకోణం కేసు దర్యాప్తులో ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఐపీఎస్ అధికారిణిపై ఆరోపణలు వచ్చాయి. సీఐడీ దర్యాప్తులో ఇది బయటపడింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆమెపై కేసు నమోదు చేసింది. (CBI books IPS Officer) మహారాష్ట్రలోని జల్గావ్లో ఉన్న భైచంద్ హీరాచంద్ రైసోని క్రెడిట్ సొసైటీలో రూ.1,200 కోట్ల కుంభకోణం వెలుగుచూసింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ పేరుతో వందలాది వ్యక్తులను ఆ సంస్థ మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
కాగా, 2020 నుంచి 2022 వరకు ఆర్థిక నేర విభాగం డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారిణి భాగ్యశ్రీ నవ్టేక్ ఈ స్కామ్‌పై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నేతృత్వం వహించారు. అయితే ఒకే రోజు ఒకే నేరం కింద మూడు కేసులు నమోదు చేయడం, ఫిర్యాదుదారులు హాజరుకాకుండానే వారి సంతకాలను ఫోర్జరీ చేయడం, తప్పుడు పత్రాలు సృష్టించడంలో ఆమె ప్రమేయం ఉన్నట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. దీంతో సీఐడీ నివేదిక ఆధారంగా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని పూణె పోలీసులను మహారాష్ట్ర హోంశాఖ ఆదేశించింది.
మరోవైపు 2020లో ఈ కుంభకోణం కేసును సీబీఐకి బదిలీ చేశారు. దీంతో 12 బ్యాంకులను మోసం చేసినందుకు ఢిల్లీకి చెందిన కంపెనీ డైరెక్టర్లపై అవినీతి, చీటింగ్ కేసు నమోదైంది. అలాగే ఈ స్కామ్‌పై దర్యాప్తులో ఫోర్జరీ, తప్పుడు పత్రాలు సృష్టించడం వంటి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలున్న ఐపీఎస్ అధికారిణి భాగ్యశ్రీ నవ్‌టేక్‌పై కేసు నమోదు చేసినట్లు సీబీఐ గురువారం ప్రకటించింది. భారత శిక్షాస్మృతిలోని 120-బీ, 466, 474, 201 సెక్షన్లకు సంబంధించి ఆమెపై అభియోగాలు మోపినట్లు పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 1
- 200 crore scam
- Case
- cbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

