Cash for Job | అసోంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కుంభకోణం.. పోలీసులు సహా 21 మంది ఉన్నతాధికారులపై వేటు
అసోంలో (Assam) ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్న కేసులో 21 మంది ఉన్నతాధికారులపై ప్రభుత్వం వేటు (Suspend) వేసింది చేశారు. 2013/14 సంవత్సరంలో అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APSC) నిర్వహించిన రిక్రూట్మెంట్లో సర్వీస్ కమిషన్ సహా పలువురు అధికారులు ఉద్యోగాలను అమ్ముకున్నారని (Cash for Job) ఆరోపణలు ఉన్నాయి.
గువాహటి: అసోంలో (Assam) ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్న కేసులో 21 మంది ఉన్నతాధికారులపై ప్రభుత్వం వేటు (Suspend) వేసింది చేశారు. 2013/14 సంవత్సరంలో అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APSC) నిర్వహించిన రిక్రూట్మెంట్లో సర్వీస్ కమిషన్ సహా పలువురు అధికారులు ఉద్యోగాలను అమ్ముకున్నారని (Cash for Job) ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఏపీఎస్సీ చైర్మన్ రాకేశ్ కుమార్ పాల్ (Rakesh Kumar Paul) సహా 70 మందిని సిట్ (SIT) అరెస్టు చేసింది. తాజాగా మరో 21 మందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వారిలో అస్సాం సివిల్ సర్వీసెస్ (ASC)కు చెందిన నలుగురు అధికారులు, పోలీసు శాఖలో (APS) 11 మంది, ముగ్గురు అసిస్టెంట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్లు, ఇద్దరు కోఆపరేటివ్ సొసైటీస్‌కు రెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, ఒక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. గతవారం మరో ఇద్దరు ఏపీఎస్ అధికారులను సిట్ అరెస్టు చేసింది.
రాకేశ్ కుమార్ పాల్ ఏపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న సమయంలో 2013-14లో కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (CCE) నిర్వహించారు. దీనిద్వారా వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీచేశారు. అయితే ఉద్యోగాలను భారీ మొత్తానికి అమ్ముకున్నారని, అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌ను నియమించింది. ఉద్యోగాల భర్తీలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిందని విచారణలో తేలింది. దీంతో 2016లోనే అప్పటి ఎపీఎస్సీ చైర్మన్ పాల్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఏండాది మార్చిలో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, 2014లో అక్రమమార్గంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

