అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరిపై కేసు నమోదు… ఎందుకంటే?
లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పార్టీల నేతలపై అవినీతి ఆరోపణలతోపాటు ఇతర కేసులు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, ఆయనతో కలిసి ఎన్నికల్లో పోటీకి జతకట్టిన రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అధ్యక్షుడు జయంత్ చౌదరిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరు కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరి కలిసి గురువారం రాత్రి గేటర్ నోయిడాలో పెద్ద సంఖ్యలో తమ పార్టీ కార్యకర్తలను సమీకరించినట్లు ఎఫ్ఆర్ఐలో పేర్కొన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ, ఆర్ఎల్డీ చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరికి తలుపులు తెరిచే ఉన్నాయంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత జయంత్ బీజేపీతో జతకడతారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే జయంత్ చౌదరి దీనిని ఖండించారు. జాట్ల ఓట్లను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. బీజేపీ ప్రయత్నాలు ఫలించవని అన్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరుగనున్నది. ఈసారి నాలుగు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. దీంతో ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీ, ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి, మయావతి నేతృత్వంలోని బీఎస్పీతోపాటు కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

