Watch: స్కూటర్‌ను ఢీకొట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?
Car Drags Scooter | కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి స్కూటర్‌ను ఢీకొట్టాడు. కారు ముందు భాగంలో స్కూటర్ చిక్కుకున్నప్పటికీ ఆగలేదు. ఆ స్కూటర్‌ను రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీంతో రోడ్డుపై రాపిడి వల్ల నిప్పురవ్వలు వచ్చాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భువనేశ్వర్: కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి స్కూటర్‌ను ఢీకొట్టాడు. కారు ముందు భాగంలో స్కూటర్ చిక్కుకున్నప్పటికీ ఆగలేదు. ఆ స్కూటర్‌ను రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. (Car Drags Scooter) దీంతో రోడ్డుపై రాపిడి వల్ల నిప్పురవ్వలు వచ్చాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. జనవరి 31న రాత్రి వేళ భువనేశ్వర్‌లోని పాటియా-నందనకనన్ రహదారిపై మహిళ నడుపుతున్న స్కూటర్‌ను ఒక కారు ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన ఆమెకు గాయాలయ్యాయి.
కాగా, ఆ స్కూటర్ కారు ముందు భాగానికి చిక్కుకున్నది. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన కారును ఆ డ్రైవర్ ఆపలేదు. స్కూటర్‌ను రోడ్డుపై ఈడ్చుకుంటూ కిలోమీటరు దూరం ప్రయాణించాడు. దీంతో రోడ్డు రాపిడి వల్ల నిప్పురవ్వలు వచ్చాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన స్కూటర్ ఓనర్ అయిన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, మరో వాహనంలో వెళ్తున్న ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ଭୁବନେଶ୍ୱର ରେ ଭୟଙ୍କର ଦୃଶ୍ୟ…#Bhubaneswar #Accidente #viralvideo pic.twitter.com/t5tYToA0oP
— 𝓓𝓲𝓹𝓪𝓴 𝓚𝓾𝓶𝓪𝓻 𝓢𝓪𝓶𝓪𝓵 (@Dipakkusamal) January 31, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bhubaneshwar
- car
- Drags
- scooter
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

