Car Falls From Bridge | తప్పుగా చూపించిన జీపీఎస్.. నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి పడిన కారు, ముగ్గురు మృతి
Car Falls From Bridge | జీపీఎస్ నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడంతో నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారు కింద పడింది. అందులో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు.
లక్నో: జీపీఎస్ నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడంతో నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారు కింద పడింది. (Car Falls From Bridge) అందులో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని డేటాగంజ్‌కు కారులో వెళ్తున్నారు. ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఆ కారు వేగంగా ప్రయాణించింది.
కాగా, నావిగేషన్ పొరపాటు వల్ల నిర్మాణంలో ఉన్న వంతెనపైకి ఆ కారు దూసుకెళ్లింది. దీంతో వంతెన పైనుంచి కింద ఉన్న రామగంగా నదిలో అది పడింది. ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు, కొన్ని నెలల కిందట భారీ వరదల కారణంగా నిర్మాణంలో ఉన్న వంతెన ముందు భాగం నదిలో కూలిపోయిందని పోలీసులు తెలిపారు. దీని గురించి జీపీఎస్‌లో మార్పు చేయకపోవడంతో నావిగేషన్ మ్యాప్‌లో తప్పుగా చూపించిందని చెప్పారు. అలాగే ఆ వంతెన ప్రవేశం వద్ద ఎలాంటి సూచనలు, హెచ్చరికలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ కారు తప్పుదారి పట్టిందని, వంతెన పైనుంచి కింద ఉన్న నదిలో పడిందని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

