న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత స్వచ్ఛంద సంస్థల్లో ఒకటైన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్)కు భారీ దెబ్బ తగిలింది. ఈ సంస్థ విదేశీ విరాళాలను స్వీకరించడానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. విదేశీ విరాళాల స్వీకరణకు చెందిన ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని ఉల్లంఘించినందుకే రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ ప్రకటనపై సీపీఆర్ స్పందిస్తూ రిజిస్ట్రేషన్ రద్దుపై న్యాయపోరాటానికి వెనుకాడమని స్పష్టం చేసింది.