Natural Plastic Cafe: కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు ప్లేట్ తడి అటుకులు..ఎక్కడంటే?
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, అమ్మకాలను జూలై 1 నుంచి పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నిషేధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొని వినియోగదారులకు ఇష్టమైన ఆహారాన్ని ఇచ్చే కేఫ్ వెలిసింది. జునాగఢ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ 'నేచురల్ ప్లాస్టిక్ కేఫ్' అనే పేరుతో ఓ హోటల్‌ను ప్రారంభించింది. ఇక్కడ టిఫిన్ చేయాలంటే పైసలకు బదులుగా ప్లాస్టిక్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. కిలో ప్లాస్టిక్ తీసుకొస్తే వేడివేడి తడి అటుకులు తినొచ్చు.
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, అమ్మకాలను జూలై 1 నుంచి పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నిషేధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొని వినియోగదారులకు ఇష్టమైన ఆహారాన్ని ఇచ్చే కేఫ్ వెలిసింది. జునాగఢ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ‘నేచురల్ ప్లాస్టిక్ కేఫ్’ అనే పేరుతో ఓ హోటల్‌ను ప్రారంభించింది. ఇక్కడ టిఫిన్ చేయాలంటే పైసలకు బదులుగా ప్లాస్టిక్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. కిలో ప్లాస్టిక్ తీసుకొస్తే వేడివేడి తడి అటుకులు తినొచ్చు.
ఈ కేఫ్‌ను ‘సర్వోదయ్ సఖి మండల్’కు చెందిన మహిళల బృందం నిర్వహిస్తుంది. కేఫ్ అభివృద్ధికి గ్రూప్ రూ. 50,000 అందించింది. ప్రజలు తమ ఇంటినుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకురావచ్చు. దాని బరువును బట్టి మెనూలోని ఆహార పదార్థాలను కొనుగోలు చేయవచ్చు. కేఫ్ ద్వారా సేకరించిన వ్యర్థాలు జునాగఢ్ పరిపాలనతో టై-అప్ ఉన్న రీసైక్లింగ్ ఏజెన్సీకి వెళ్తాయి.
క్లీన్ అండ్ గ్రీన్ జునాగఢ్‌లో భాగంగా ఈ కేఫ్‌ను ప్రారంభించినట్లు ఆ జిల్లా కలెక్టర్ రచిత్‌రాజ్ తెలిపారు. 500 గ్రాంల ప్లాస్టిక్ వ్యర్థాలకు ఒక గ్లాసు నిమ్మరసం ఇస్తామన్నారు. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకొస్తే ఒక ప్లేట్ ధోక్లా లేదా పోహా అందిస్తామని చెప్పారు. కేఫ్ మెనూలో వివిధ రకాల సాంప్రదాయ గుజరాతీ వంటకాలు ఉంటాయని వివరించారు. అన్ని వంటకాలను మట్టి పాత్రల్లోనే వడ్డిస్తారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

