Bus Catches Fire | పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సులో మంటలు.. డ్రైవర్ అలెర్ట్‌తో తప్పిన ముప్పు
Bus Catches Fire | పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. (Bus Catches Fire) గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సు నిలిపివేశాడు. పెళ్లి బృందాన్ని అలెర్ట్ చేయడంతో వారు వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. అనంతరం ఆ బస్సు మంటల్లో కాలిపోయింది.
చండీగఢ్: పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. (Bus Catches Fire) గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సు నిలిపివేశాడు. పెళ్లి బృందాన్ని అలెర్ట్ చేయడంతో వారు వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. అనంతరం ఆ బస్సు మంటల్లో కాలిపోయింది. పంజాబ్, హర్యానా మధ్య ఉన్న కర్నాల్ జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది. సుమారు 17 మందితో కూడిన పెళ్లి బృందం ఢిల్లీలో జరిగిన వివాహ వేడుకకు హాజరైంది. అనంతరం వారంతా బస్సులో తిరిగి కర్నాల్‌కు బయలుదేరారు.
కాగా, శనివారం ఉదయం కర్నాల్ జాతీయ రహదారి వద్దకు చేరుకున్న ఆ బస్సులో పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సు నిలిపివేసిన అతడు పెళ్లి బృందాన్ని అప్రమత్తం చేశాడు. దీంతో వారంతా బస్సు నుంచి కిందకు దిగారు. అనంతరం ఆ బస్సు మంటల్లో కాలిపోయింది. డ్రైవర్ అలెర్ట్‌తో పెళ్లి బృందానికి ప్రాణాపాయం తప్పింది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
करनाल नेशनल हाईवे पर आज बड़ा हादसा होने से टल गया। यहां दिल्ली शादी समारोह से करनाल लौट रही निजी बस में शॉर्ट सर्किट की वजह से आग लग गई। समय रहते बस में सवार सभी बारातियों को बस से सुरक्षित बाहर निकाला गया। घटना की सूचना मिलते ही फायर ब्रिगेड व पुलिस की टीम मौके पर पहुंची।… pic.twitter.com/RTP9TisqEz
— Punjab Kesari Haryana (@HaryanaKesari) November 25, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

