కెప్టెన్ కన్నుమూత
ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తదితరులు సంతాపం తెలిపారు.
- డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ మృతి
- అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తదితరులు సంతాపం తెలిపారు. విజయకాంత్ గత 4-5 ఏండ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భార్య ప్రేమలతనే పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు.1991లో విజయకాంత్ నటించిన ‘కెప్టెన్ ప్రభాకరన్’ సినిమా హిట్ కావడంతో ఆయన్ను అభిమానులు ‘కెప్టెన్’గా పిలుచుకుంటున్నారు.
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయ్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో 2005లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. డీఎండీకేను స్థాపించారు. 2006 శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ నుంచి తానొక్కడే గెలుపొందినా.. ఆయన పార్టీ 8.40 శాతం ఓట్లు సంపాదించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీడీఎంకేతో పొత్తు పెట్టుకొని 29 స్థానాలు గెలిచారు. దీంతో డీఎండీకే రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచి విజయకాంత్ విపక్ష నేత అయ్యారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ కూటమితో జట్టు కట్టారు. అయితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ డిపాజిట్ కోల్పోయారు. తర్వాత పార్టీ ప్రభ క్రమంగా తగ్గుతూ వచ్చింది.
కేసీఆర్ సంతాపం
ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నటుడిగా కళారంగానికి, రాజకీయ నాయకుడిగా ప్రజలకు విజయ్కాంత్ చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. విజయకాంత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

