Heavy Rains | ఉత్తరాదిని ముంచెత్తిన వరద : హిమాచల్‌లో నీట మునిగిన ఆలయం..భాక్రా నంగల్ రహదారి మూసివేత!
దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో (Heavy Rains) జనజీవనం స్తంభించింది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో (Heavy Rains) జనజీవనం స్తంభించింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హర్యానా, యూపీ, మధ్య ప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో రికార్డు వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తోంది. రాష్ట్రంలో పలు వంతెనలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. మండిలోని పంచ్వక్త్ర ఆలయం నీటమునగగా, కసోల్ ప్రాంతంలోని కుల్లులో వరద నీటిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడటంంతో భాక్రా నంగల్ రహదారిని మూసివేశారు.
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ శక్తిపీఠం శ్రీ నైనా దేవి ఆలయానికి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వరద నీరు ముంచెత్తడంతో పంజాబ్ వీధుల్లో పడవలు దర్శనమిచ్చాయి. కాగా, దేశ రాజధానిలో 41 ఏండ్ల గరిష్టస్ధాయిలో వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఒకేరోజు 153ఎంఎం వర్షపాతం నమోదవడంతో 1982 తర్వాత ఈ స్ధాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఈ వర్షాకాలం సీజన్లో ఢిల్లీలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ఢిల్లీ వాసులు అప్రమ్తతంగా ఉండాలని ఐఎండీ యల్లో అలర్ట్ జారీ చేసింది.
కుండపోతతో దేశ రాజధానిలోని పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్లు, హాస్పిటల్ ప్రాంగణాలు, మాల్స్ సహా వాణిజ్య సంస్ధల ప్రాంగణాలు నీటమునిగాయి. భారీ వర్షాలతో ఢిల్లీ వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రయాణీకులు, పాదచారులు మోకాలి లోతు నీళ్లలో గమ్యస్ధానాలకు చేరుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. గురుగ్రాం సైతం భారీ వర్షాలతో వణికింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెగని వర్షాలతో గడిచిన 24 గంటల్లో ఐదుగురు మరణించారు. సిమ్లాలో ముగ్గురు, చంబా, కులు ప్రాంతాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
బియాస్ నది ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తుండగా వరద పోటెత్తిన కాంగ్ర, మండి, సిమ్లా తదితర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఇక జమ్ము కశ్మీర్లో జీలం నదిలో నీటి ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి రాజధాని చండీఘఢ్లో శనివారం రోజంతా కుండపోతతో నగరం తడిసిముద్దయింది.
Read More :
Flash Floods | జమ్మూలో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన ఇద్దరు జవాన్లు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

