లక్నో : ఓ పెళ్లి కూతురు గాల్లోకి కాల్పులు జరిపి వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌ఘర్ జిల్లాలోని జెథ్వారా ఏరియాకు చెందిన రూపా పాండే తన వివాహ ముహుర్తానికి ముందు స్టేజ్ ఎక్కుతున్న క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపింది. ఈ వీడియో పోలీసుల దాకా చేరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూపా పాండే కాల్పులు జరిపిన రివాల్వర్ ఆమె మామ రామ్ నివాస్ పాండేది అని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రూపా పాండేతో పాటు రామ్ నివాస్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
सोशल मीडिया पर 30 मई का वीडियो वायरल है. प्रतापगढ़ के जेठवारा थाना क्षेत्र के लक्ष्मण का पुरवा में दुल्हन ने स्टेज पर चढ़ने के पहले अपने चाचा की लाइसेंसी रिवॉल्वर से हर्ष फायर किया. पुलिस ने नई दुल्हन रूपा पांडेय और चाचा रामनिवास पांडेय के खिलाफ मामला दर्ज कर जांच शुरू कर दी है. pic.twitter.com/lWYkL7vlVK
— The Lallantop (@TheLallantop) June 1, 2021