భారతీయ వివాహంలో నృత్యం, సంగీతం అంతర్భాగమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు కలిసి స్టెప్పులేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా నృత్యం చేస్తారు. ఘనంగా సంగీత్‌లు నిర్వహిస్తారు. కాగా, తనకు జన్మనిచ్చిన తండ్రికోసం ఓ పెళ్లి కూతురు తన చెల్లెతో చేసిన డ్యాన్స్ చేసింది. ఈ నృత్యప్రదర్శనను తండ్రికి అంకితమిచ్చింది. ఈ వీడియో ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నది. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నది.
ఈ వీడియోను ‘నావిక్ ప్రొడక్షన్స్’ అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోలో వధువు, ఆమె సోదరి అందమైన లెహంగాలు ధరించి స్టేజీపైకి వచ్చారు. ‘పాపా కెహ్తే హై’, ‘దిల్బరో’ పాటలపై అదిరిపోయే స్టెప్పులేశారు. డ్యాన్స్ చూసి హాల్లో ఉన్న బంధువులంతా ఎమోషనల్ అయ్యారు. వీడియో చివర్లో వధువు తండ్రి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. తన కుమార్తెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు. ఇప్పటివరకూ ఈ వీడియోను 43,858 కంటే ఎక్కువ మంది లైక్ చేశారు.
View this post on Instagram
A post shared by International Wedding & Event Planners (@navikproductions)