Bride gives birth after wedding | పెళ్లైన మరునాడే బిడ్డకు జన్మనిచ్చిన నవ వధువు.. షాక్‌లో వరుడి కుటుంబం
Bride gives birth after wedding | పెళ్లైన మరునాడు నవ వధువు బిడ్డను ప్రసవించింది (Bride gives birth after wedding). ఈ విషయం తెలిసి వరుడి కుటుంబం షాక్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
లక్నో: పెళ్లైన మరునాడు నవ వధువు బిడ్డను ప్రసవించింది (Bride gives birth after wedding). ఈ విషయం తెలిసి వరుడి కుటుంబం షాక్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గ్రేటర్ నోయిడాలోని గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి సికింద్రాబాద్‌కు చెందిన మహిళతో ఈ నెల 26న పెళ్లి జరిగింది. అయితే వివాహం జరిగిన మరునాడు రాత్రి కడుపులో నొప్పిగా ఉందని నవ వధువు చెప్పింది. దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు, నవ వధువు ఏడు నెలల గర్భిణీ అని చెప్పారు. ఈ విషయం తెలిసి నవ వరుడు, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
కాగా, ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆ మహిళ తర్వాత రోజు పాపకు జన్మనిచ్చింది. ఆమె గర్భవతి అన్న సంగతి తమకు తెలుసని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. వరుడు, అతడి కుటుంబానికి ఈ విషయం చెప్పకుండా దాచినట్లు చెప్పారు. అయితే వధువుకు ఇటీవల రాళ్లు తొలగించే సర్జరీ జరిగిందని, దాని వల్ల ఆమె కడుపు ఉబ్బినట్లుగా వధువు కుటుంబం తమకు చెప్పిందని వరుడి బంధువులు ఆరోపించారు. నవ వధువు ఏడు నెలల గర్భిణీ అని డాక్టర్లు చెప్పడంతో తాము షాకైనట్లు తెలిపారు.
మరోవైపు ఇరు కుటుంబాలు ఒక అంగీకారానికి వచ్చాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించాయి. నవ వధువు, ఆమె జన్మనిచ్చిన పాపను వరుడి కుటుంబం నిరాకరించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారిని తీసుకుని సికింద్రాబాద్‌కు తిరిగి వెళ్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

